సై సై జోడెడ్లా బండి ..బండి
హోయ్ ....షోకైన దొరలా బండి
ఖంగు ఖంగు మని గంటల బండి
ఘల్లు ఘల్లుమని గజ్జెల బండి
చుట్టుపక్కల పన్నెండామడ దీనికి
పోటీ లేదండీ..
మహా ప్రభో...
కంటికాటుకెట్టి గట్లున్న గడ్డికోసి
గుత్తంగా రైక తొడిగి కొడవలేసి కోతకు వంగి
వగలాడి వోరగ చుస్తే వులిక్కి పడతది నా యెడ్లు
మహాప్రభో....
నెత్తిన బుట్టపెట్టి అడుగులో ఆడుగులేసి
సరదాగా సరసాలాడుతూ
పరిగెడుతూ పకపకలాడుతూ
నెరజాణ సైగల చూస్తే కనపడదు ముందు దారి
మహాప్రభో
మట్టగోచి గట్టిగ దోపి మట్టి తట్ట పైకి లేపి
చీరవేసి మనమీద ఒడుపుగా జబ్బమీద దెబ్బవేసే
చిలక కొలికి కులుకుతూంటే
జల్లు జల్లు మంటుంది నా ఒళ్ళూ..
మహా ప్రభో ....
No comments:
Post a Comment