చల్లని స్వామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లి
ఎదలో కరుణే నీకుంటే ఉదయం కానీకోయీ
చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లి
ఎదలో కరుణే నీకుంటే ఉదయం కానీకోయీ
చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లి
ముక్కున ముక్కెర అందం కాని ముచ్చటకది ప్రతిబంధం
ముక్కున ముక్కెర అందం కాని ముచ్చటకది ప్రతిబంధం
మన ఆనందానికి అడ్డయ్యే ఏ అందమైనా ఎందులకు
అందమైనా ఎందులకు .. ఊ ..
రసమయ హృదయం నీదైతే రతిరాజా కను మూయకుము
మా ప్రణయము పచ్చగ ఉండే వరకు రణభేరి మ్రోగకుము
చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లి
గాజులు చేతికి సొంపు ప్రణయానికి అవి సడలింపు
గాజులు చేతికి సొంపు ప్రణయానికి అవి సడలింపు
మన అనుబంధానికి అడ్డయ్యే ఈ ఆభరణాలు ఎందులకు
ఆభరణాలు ఎందులకు
తీరని కోరిక నీదైతే తారా ,,, చంద్రుని తరుమకుము
ఈ తీయని వెన్నెల దోచుకుపోయే దినరాజును రానీయకుము
చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లి
పదములకందము అందియలు అవి పలుమరు చేయును సందడులు
పదములకందము అందియలు అవి పలుమరు చేయును సందడులు
తలపులు పండే తరుణంలో ఈ సవ్వడులన్నే ఎందులకు
సవ్వడులన్నీ ఎందులకు …
చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లి
ఎదలో కరుణే నీకుంటే ఉదయం కానీకోయీ
చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము ……… జా….బిల్లి
No comments:
Post a Comment