తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా
ప్రతి మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవి సొంతం కోసం కాదను సందేశం
మంచినే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద
తరలి
బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా
బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయొజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద.
తరలి....
2 comments:
మీ కృషి అభినందనీయం. కవి, గాయకుల పేర్లూ, సంగీత కర్త ల వివరాలు, చిత్రం పేరూ, కాలమూ, వీలున్న చోట దృశ్య శ్రవణాలకో లంకే పెడితే ఇంకా బావుంటుంది.
ప్రకటనల వల్ల మీకేమీ రాబడి లేకపోతే, తీసెయ్యొచ్చేమోకదా, ఆలోచించండి. ఆభినందనలు.
ధన్యవాదాలు....
ఇక్కద ప్రకటనలు ఏవీ లేవుకదా....ఇక పోతే మొత్తం వెబ్ లో సమాచారమంతా సినిమా పేర కాని సింగెర్స్ పేర గాని రచయిత పేరగాని ఉంటున్నాయి..అవి కూడా చాలా ఉన్నాయి.
కాని అక్షర క్రమం లో ఎక్కువ లేవు..అందుకే ఇలా పెట్టాను.
Post a Comment