Saturday, June 7, 2008

పెను చికటాయే లోకం

పెనుచీకటాయె లోకం
చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమా
విధియే పగాయె (పెను)

చిననాటి పరిణయగాథ ఎదిరించలేనైతినే (౨)

ఈనాటి ప్రేమగాథ తలదాల్చలేనైతినే

కలలే నశించిపోయె మనసే కృశించిపోయె

విషమాయె మా ప్రేమా విధియే పగాయె


మొగమైన చూపలేదే మనసింతలో మారెనా

నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా

తొలినాటి కలతలవలన హృదయాలు బలికావలెనా

విషమాయె మా ప్రేమా విధియే పగాయె (పెను)

No comments: