మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కధయే విన్నారా
మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కధయే విన్నారా
జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెల లోనే చీకటి మూగే
జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెల లోనే చీకటి మూగే
పలుకగాలేక పదములు రాక
పలుకగా లేక పదములే రాక
బ్రతుకే తానె బరువై సాగే
చెదరిన వీణా రావలించేనా
జీవన రాగం చిగురించేనా
చెదరిన వీణా రావలించేనా
జీవన రాగం చిగురించేనా
కలతలు పోయి వలపులు పొంగి
కలతలే పోయి వలపులే పొంగి
మనసే లోలో పులకించేనా
No comments:
Post a Comment