Thursday, June 5, 2008

ఈ మౌనం ఈ బిడియం

ఈ మౌనం, ఈ బిడియం, ఇదేనా ఇదేనా చెలియ కానుకా

ఈ మౌనం, ఈ బిడియం, ఇదేలే ఇదేలే మగువ కానుకా

ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా (౨)

మమతలన్ని తమకు తామే (౨)

అల్లుకోనేది మాలికా, ఆ . . .

ఆ . . ఈ మౌనం, ఈ బిడియం, ఇదేనా ఇదేనా చెలియ కానుకా, ఈ మౌనం

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరికా

ఆహా, ఒహో

అ ఆ . . .

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరికా

కనులు కలిసి అనువదించు ప్రణయ భావగితికా
ఆ . . .

ఆ . . ఈ మౌనం, ఈ బిడియం, ఇదేలే ఇదేలే మగువ కానుకా, ఈ మౌనం

ఏకాంతము దొరికినంత ఎదమోమా నీ వేడుక (౨)

ఎంత ఎంత ఎడమైతే (౨)

అంత తీపి కలయికా, ఆ . .

ఆ. . ఈ మౌనం

ఆహా

ఈ బిడియం

ఊహూ

ఇదేనా ఇదేనా చెలియ కానుకా

ఈ మౌనం

ఆహా

ఈ బిడియం

ఊహూ

ఇదేలే ఇదేలే మగువ కానుకా

No comments: