కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల (౨)
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు, వాడు కనబడితే చాలు నాకొళ్ళు తెలవదు (౨)
పిక్కలపైదాకా చుక్కల చీరగట్టి (౨)
పిడికిలంత నడుముచుట్టు పైటకొంగు బిగగట్టి
వెళుతుంటే .. చూడాలీ .. వెళుతుంటే చూడాలి దాని నడక
అబ్బో వెర్రెత్తి పోవాలి దాని యెనక .......(కడవెత్తుకొచ్చింది)
చురకత్తి మీసాలు, జుట్టంతా ఉంగరాలు (౨)
బిరుసైన .. కండరాలు, బిరుసైనా కండరాలు, మెరిసేటి కళ్ళడాలు
వస్తుంటే .. చూడాలీ .. వస్తుంటే చూడాలి వాడి సోకు
వాడూ వద్దంటే ఎందుకీ పాడుబతుకు ..........(కాడెత్తుకొచ్చాడు)
తలపాగా బాగ చుట్టి, ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరకచేనులో వాడు
దున్నుతుంటే .. చూడాలీ .. దున్నుతుంటే చూడాలి వాడి జోరు
వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు .......(కాడెత్తుకొచ్చాడు)
(నీలాటిరేవులోన నీళ్ళకడవ ముంచుతూ
వొంగింది చిన్నది, ఒంపులన్ని ఉన్నదీ) (౨)
చూస్తూంటే చాలు దాని సోకుమాడ, పడిచస్తాను వస్తనంటె కాళ్ళకాడ .....(కడవెత్తుకొచ్చింది)
No comments:
Post a Comment