Wednesday, June 11, 2008

నా హృదయం లో నిదురించే చెలి

నా హృదయంలో నిదురించే చెలీ!

కలలలోనే కవ్వించే సఖీ

మయూరివై వయారివై నేడే

నటనమాడి నీవే నన్ను దోచినావే!

నా హృదయంలో నిదురించే చెలీ!

నీ కన్నులలోన - దాగెనులే వెన్నెలసోన

చకోరమై నిను వరించి అనుసరించినానే

కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలీ!

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే (౨)

పల్లవిగా పలుకరించరావే (౨) నీ వెచ్చని నీడ -

వెలసెను నా వలపుల మేడ

వెచ్చని నీడ - వెలసెను నా వలపుల మేడ

నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే

నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలీ!

No comments: