అలివేణి ఆణిముత్యమా నీకంట నీటిముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో .. జాలి నవ్వు జాజి దండలు
అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా
జాబిలి కలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండెలో
అలివేణి ఆణిముత్యమా
కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి
కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా ....... బొట్టుగా
వద్దంటే ఒట్టుగా
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అడుగుమడుగులొత్తనా .......... మెత్తగా
అవునంటే తప్పుగా
అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టునీడకి
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టునీడకి
పొగడదండలల్లుకోనా ....... పూజగా
పులకింతల పూజగా
తొలిజన్మల నోముకి దొరనవ్వుల సామికి
తొలిజన్మల నోముకి దొరనవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా .... చల్లగా
మరుమల్లెలు చల్లగా
అలివేణి ఆణిముత్యమా నీకంట నీటిముత్యమా
జాబిలి కలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండెలో
అలివేణి ఆణిముత్యమా అలివేణి ఆణిముత్యమా
No comments:
Post a Comment