ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గుచెంది సాగిపోయే...
దాగిపోయె
ముందరున్న చిన్నదాని అందమేమో
పొందుగోరు చిన్నవాడి తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడ మరచిపోయే...
తోచదాయె
పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో ఎందుకోసమో
పైటకొంగు కులికింది ఎవరికోసమో ఎవరికోసమో
నీలోని పొంగులు నావేననీ
చమరించు నీ మేను తెలిపెలే (పొందుగోరు)
కొంటెచూపు రమ్మంది ఎందుకోసమో ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే సరియైన సమయం రాలేదులే
మనువైన తొలిరేయి మనదిలే (ముందరున్న)
ఎన్నాళ్ళు మనకీ దూరాలు ఎ'నాడు తీరునీ విరహాలు
కాదన్నవారు ఔనన్న నాడు కౌగిళ్ళ కరిగేది నిజములె (ముందరున్న)
No comments:
Post a Comment