పులకించని మది పులకించు
వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు
మనసునే మరపించు
గానం మనసునే మరపించు
రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలతో రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం
జీవమొసగును గానం మది చింతబాపును గానం
పులకించని మది పులకించు.......
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
కూలిపోయిన తీగలైనా కొమ్మనలికి ప్రాకును
కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మదిలో
దోరవలపే కురియు ఎదే దోచుకొనుమని పిలుచు
పులకించని మది పులకించు .....
No comments:
Post a Comment