పందిట్లో పెళ్ళవుతున్నది
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది
పెళ్ళికుమార్తెకు పూజఫలము చేతికందేను చేతికందేను
గోరింటాకు పూయెదపూసి గోళ్ళు కందేను నా గోళ్ళు కందేను
కోరికలు తీరుచున్నవి అవి తీరుచున్నవి
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది
వధువు వరుడు పల్లకిలోన పరదేశ మేగెదరు
వధువు వరుడు పల్లకిలోన పరదేశ మేగెదరు
వారిని తలచి బంధువులంతా కటకము వగచెదరు ఊ ఊ
కటకము వగచెదరు కన్నీరే కురియుచున్నది
మది కరుగుచున్నది ఒంటరిగా ఆడెదను
ఓ ఒంటరిగా ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
No comments:
Post a Comment