మోహన రాగమహా మూర్తిమంతమాయె (౨)
నీ ప్రియ రూపము కన్నుల ముందర
నిలచిన చాలునులే
మోహన రాగమహా మూర్తిమంతమాయె
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి (౨)
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా
మోహన రాగమహా మూర్తిమంతమాయె
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా (౨)
ఆరాధించిన ప్రియభామినిలా పరవశించెననగా (౨)
మోహన రాగమహా మూర్తిమంతమాయె
No comments:
Post a Comment