Thursday, June 26, 2008

మావి చిగురు తినగానే

మావి చిగురు తినగానే.... కోయిల పలికేనా
మావి చిగురు తినగానే.... కోయిల పలికేనా
కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఎమో ఎమనునో గాని ఆమని ఈవని
మావి చిగురు తినగానే.... కోయిల పలికేనా
కోయిల పలికేనా
తిమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తిమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా..సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పొడుములు
ఎమొ ఎవ్వరిదోగాని ఈవిరి గడసరి
మావి చిగురు తినగానే కోయిల పలికేనా ఆ ఆ
కోయిల పలికేనా ..
ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల జంపాల...జంపాల ఉయ్యాల
ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
పలకరింతలో పులకరింతలో
ఎమో ఎమగునోగాని ఈ కధ మన కధ
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఎమో ఎమనునో గాని ఆమని ఈవని
మావి చిగురు తినగానే కోయిల పలికేనా

No comments: