బ్లాగు అంటె ఎదో రాయాలి కదా సారూ ..మీరేంటి రాయడం మానేసారు..
ఇదీ నేనొదుర్కుంటున్న ప్రశ్నలు...
నిజమే అలా అని నే కోరి ఏరిన పాటలు పోస్టకూడదని కాదుగా.
ఈ వనం లో అన్నీ మొక్కలు పెరగాలనే నా ఆకాంక్ష. రాయటం ఎందుకు తగ్గించానాననే కదా...
ఓ ప్రసవం నన్ను పడేసి పోయింది..
బాల్యం అక్కున చేర్చుకుని ఆటపాటలతోకాలం గడిపి పారిపోయింది..
ఇక యవ్వనం ఎప్పుడొచ్చిందో తెలుసుకునేలోపు శరీరం వృద్దాప్యం తో జతకట్టేస్తుంది..
మనసు కు ఆ చెలిమి ఇష్టం లేదు..
కానీ శరీరం ఆ ఉచ్చులో పడి..ఇప్పటికి కొన్ని దంతాలు ,
కొంత వినికిడి ,మరింత దృష్టి పోగొట్టుకుంది..
ఇక పోస్టుతూ కూర్చోవాలంటె మరింత ప్రయాస.
ఇంకొక్క సంవత్సరం ..
ఆఫీసులో తరిమేస్తారు..
అప్పటికి ఈ వనం బాగా పెరిగిఉంటుంది..
ఇక్కడే కబుర్లు చెబుతూ మకాం పెట్టేస్తా..
అందాకా ఈ పాటలు వినండి..
2 comments:
#tel
nijam . yavvanam eppuDochchindO telisElOpu SarIram vRuddhaapyamtO jata kaTTEstundi - baavundi
#tel
hello prasanna ..
thanks ...:))
Post a Comment