Monday, July 28, 2008

కోతి బావకు పెళ్ళంటా ....చిత్రం : మల్లీశ్వరి (1951)

కోతిబావకు పెళ్ళంట
కోవెలతోట విడిదంట

మల్లి మాలతి వస్తారా
మాలికలల్లి తెస్తారా
బంతి జాజి చేమంతి
బంతులు కట్టి తెస్తారా
పెళ్ళికి మీరు వస్తారా
పేరంటానికి వస్తారా
పందిరి వేస్తాము
ముందుర ముగ్గులు పెడతాము
పందిరికింద పెళ్ళివారికి విందులు చేస్తాము
మంచి విందులు చేస్తాము
బాకా బాజా డోలు సన్నాయ్
మేళాలెడతారు తప్పెట తాళాలెడతారు
అందాల మా బావగారికి గంధాలు పూసి
గారాల మా బావమెడలో హారాలు వేసి
కుళ్ళాయెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసి గంధం పూసి కుళ్ళాయేసి తురాయి పెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
పల్లకి యెక్కి కోతిబావ పళ్ళికిలిస్తాడు
బావ పళ్ళికిలిస్తాడు
మా కోతిబావ పళ్ళికిలిస్తాడు

No comments: