Friday, July 25, 2008

చుక్కలన్నీ చూస్తున్నాయి..చిత్రం :జ్వాలాదీప రహస్యం

చుక్కలన్ని చూస్తున్నాయీ
చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ
ఎక్కడైన దాగుందామా చక్కనైన చినవాడా
చందమామ వస్తున్నాడు చందమామ వచ్చేనూ
నిన్ను నన్ను చూసేనూ ఎక్కడైన దాగుందామా అందమైన చినదానా
మల్లె తీగమాటున కళ్ళు కలుపుకుందామా కళ్ళలోని కోరికతో
మనసు నింపుకుందామా మల్లె తీగమాటున మల్లెలన్ని చూచేనూ
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే

చుక్కలన్ని .............
కొలనులోని నీళ్ళలో కొంతసేపు వుందామా
కలలుగనే హృదయంలో వలపు నిలుపుకుందామా
కొలనులోన దాగుంటే అలలు మనను చూచేనూ
వలపులోని తీయదనం అలలే కాజేయులే

చుక్కలన్ని.............
నా కన్నుల చాటుగా నిన్ను దాచుకుంటానే
నీకౌగిలి మాటుగా నేను నిదురపోతాలే
నేను నీకు తోడునే నేను నీకు తోడునే
నీవు నేను ఒకటైటే జీవితం స్వర్గమే

చుక్కలన్ని.............

No comments: