మనసు పలికే మనసు పలికే
మౌన గీతం మౌన గీతం
మనసు పలికే మౌన గీతం నీవే
మమతలోలికే మమతలోలికే
స్వాతిముత్యం స్వాతిముత్యం
మమతలోలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు
మనసు పలికే మౌన గీతం నీవే
మమతలోలికే స్వాతిముత్యం నీవే
శిరసు పై నేగంగనై మరుల జలకాలాడని
మరుల జలకాలాడని ఆ
సగము మేన గిరిజనై
పగలు రేయి వొదగని
పగలు రేయి వొదగని
హృదయ మేళనలో మధుర లాలనలో
హృదయ మేళనలో మధుర లాలనలో
వెలిగి పోని రాగ దీపం
వెలిగి పోని రాగ దీపం వేయి జన్మలుగా
మనసు పలికే మౌన గీతం నేడే
మమతలోలికే స్వాతిముత్యం నీవే
కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని
ఓనమాలు దిద్దని
పెదవి పై నీ ముద్దునై మొదటి తీపి అద్దని
మొదటి తీపి
లలితయామినిలో కలల కౌముదిలో
లలితయామినిలో కలల కౌముదిలో
కరిగిపోని కాలమంతా
కరిగిపోని కాలమంతా కౌగిలింతలగా
మనసు పలికే మనసు పలికే
మౌన గీతం మౌన గీతం
మనసు పలికే మౌన గీతం నీవే
మమతలోలికే మమతలోలికే
స్వాతిముత్యం స్వాతిముత్యం
మమతలోలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు
No comments:
Post a Comment