Wednesday, July 23, 2008

వలపు వలె తియ్యగా ...చిత్రం : సుమంగళి

వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా


తడబడు నడకల నడచినపుడు నీ తత్తరబాటును చూడాలి
తలుపు మూయగనే దారులు వెదకే బిత్తరచూపులు చూడాలి....2
అని తలచి తలచి ఈ తరుణం కోసం తపసు చేసినది ఇందులకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా

మురిపెములొలికే ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటకా
మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటకా....2
ఎదను తెరచి నేనిన్నినాళ్ళుగా ఎదురుచూచినది ఇందులకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా

No comments: