సిరిమల్లెనీవే విరిజల్లు కావే
వరదల్లె రావె వలపంటె నీవే
ఎలతేటి పాట చెలరేగె నాలో
చెలరేగి పోవే మధుమాసమల్లే
ఎలమావి తోట పలికింది నాలో
పలికించు కోవే మది కోవెలల్లే
నీ పలుకు నాదే నాబ్రతుకు నీదే
తొలిపూట నవ్వే వనదేవతల్లే
పున్నాగపూలే సన్నాయిపాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ....
మరుమల్లె తోట మారాకు వేసే
మారాకు వేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ....
No comments:
Post a Comment