రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
రాధా హృదయం మాధవ నిలయం
రాధా హృదయం మాధవ నిలయం
ప్రేమకు దేవాలయం.......
ఈ రాధకు నీవేర ప్రాణంఈ రాధకు నీవేర ప్రాణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం.....
నీ శుభ చరణం ఈ రాధకు శరణం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
యమునా తీరం........
యమునా తీరం రాగాల సారం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
No comments:
Post a Comment