మదిలో వీణలుమ్రోగే ఆశలెన్నొ చెలరేగే (2)
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే మదిలో
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గతొడిగింది (2)
పాలవెన్నెల స్నానాలుచేసి పూలుపూసింది మదిలో
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందు కోరేను(2)
అందాలతారయై మెరిసి చెలికానిచెంత చేరేను మదిలో
రాధలోని అనురాగమంతా మాధవునిదే లే (2)
వేణులోలుని రాగాలకోసం వేచి వున్నదిలే మదిలో
No comments:
Post a Comment