చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది
దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన కధ
చెప్పాలని ఉంది
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టి
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కధ
చెప్పాలని ఉంది
కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కధ
చెప్పాలని ఉంది
అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో
అంతటి దేవకి నా పై ఇంతటి దయ ఏలనో
ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో
నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే
నీ చల్లని మదిలో అ దేవికింత చోటిస్తే
ఆ లోకమె మరచి పోవు నీ లోనే నిలిచిపోవు
ఆ ... ఆ... ఆ... ఆ... ఆ...
No comments:
Post a Comment