Sunday, July 27, 2008

భయమేలా ఓ మనసా చిత్రం: భలే రాముడు

భయమేలా ఓ మనసా భగవంతుని లీలా
భయమేలా ఓ మనసా భగవంతుని లీలా - ఇదంతా పరమాత్ముని లీలా
భయమేలా ఓ మనసా భగవంతుని లీలా - ఇదంతా పరమాత్ముని లీలా
చీకటి వెనుక వెన్నెలరాదా - చీకటి వెనుక వెన్నెలరాదా
జీవితమింతే కాదా దీనికి చింతేలా - ఇదంతా పరమాత్మునిలీలా
సంసార జలనిధిలో కష్టసుఖాలు తరంగాలు కావే - ఇది ఎరుంగవా
శ్రీకృష్ణుని నమ్మేనా - ఆ కృష్ణుని నమ్మేనా
నీ కష్ణాలన్నీ పటాపంచలై కనుపించును త్రోవా
నీ కష్టాలన్నీ పటాపంచలై కనుపించును త్రోవా
అతడే నడిపించును త్రోవా
దిగులేల జీవా కానలేవా భగవంతుని లీలా - ఇదంతా పరమాత్ముని లీల
భయమేలా ఓ మనసా భగవంతుని లీలా - యిదంతా పరమాత్ముని లీల
భయమేలా మనసా భగవంతుని లీలా - యిదంతా పరమాత్ముని లీల


No comments: