Monday, July 28, 2008

జాబిలితో చెప్పనా ....చిత్రం : వేటగాడు

జాబిలితో చెప్పనా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా
తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు
తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు
చూపులలో చలి చుర చురలూ ఆ చలి తీరని విర విరలూ
అన్ని ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా ఆ చెప్పనా ఆ చెప్పనా చెప్పనా
గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు
గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు
కౌగిట సాగని పున్నములూ వెన్నెల వీణల సరిగమలూ
పేరంటానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవే లెమ్మని
చెప్పనా చెప్పనా ఆ చెప్పనా చెప్పనా

No comments: