Wednesday, July 9, 2008

మౌనమె నీ భాష ఒ మూగ మనసా… ఓ మూగ మనసా…

మౌనమె నీ భాష ఓ మూగ మనసా… [2]

తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు..

కల్లలు కాగానె కన్నీరవుతావు..

మౌనమె నీ భాష ఒ మూగ మనసా… ఓ మూగ మనసా…



చీకటి గుహ నీవు చింతల చెలి నీవు..

నాటకరంగానివె.. మనసా.. తెగిన పతంగానివె..

ఎందుకు వలచేవొ.. ఎందుకు వగచేవొ..

ఎందుకు రగిలేవొ.. ఎమై మిగిలేవొ.. [2]

మౌనమె నీ భాష ఓ మూగ మనసా… ఓ మూగ మనసా



కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు..

ఊహల వుయ్యలవె.. మనసా.. మాయల దెయ్యానివె..

లేనిది కోరేవు వున్నది వదిలేవు..

ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు.. [2] [మౌనమె]

No comments: