Tuesday, July 22, 2008

జేబులో బొమ్మా జే జేలా బొమ్మా ..చిత్రం: రాజు -పేద

జేజేలు విని గొప్పవారమని

చెడ్డ పనులు మాచేత చేయించకుమా ..అ..ఆ

జేబులో బొమ్మా

జే జెలా బొమ్మా

జేబులో బొమ్మ

మొక్కిన మొక్కులు చల్లంగుండి

ఎనక్కి తిరక్క గెలుస్తు ఉంటే

భక్తి తోడ నీ విగ్రహానికి

బంగారు తొడుగే చేయించెదనమ్మ

జేబులో బొమ్మా...

కనక తప్పెటలు ఘనంగా మ్రోగగా

శంఖనాదములు శివమెత్తించగా

చేసిన తప్పులు చిత్తై పోవగా

చేతులెత్తి ప్రార్థించెదనమ్మా

మారాజుకే మనసులు మారి

మంత్రి పదవి నా తలపైకొస్తే

వేడుక తీరగ పూలమాలలతో

జోడు ప్రభల కట్టించెదనమ్మా

జేబులో బొమ్మా..

మా ఇలవేల్పుగ మహిమలు చూపి

మల్లి కి న మనసు కలిపితే బొమ్మ

తకిటా తధిగిన త థతై అంటూ

చెక్క భజన చేయించెదనమ్మా.

జేబులో బొమ్మా....

No comments: