కొత్త పెళ్ళికూతురా రా రా నీ కుడికాలు ముందు మోపి రా రా
గణపతి కులసతి రా రా నువు కోరుకున్న కోవెలకు రా రా
కలిమికి కాణాచి నీ పుట్టినిల్లు చెలిమికి మాగాణి నువు మెట్టినిల్లు
ధనమున్నది బలమున్నది నీ ఇంటా
మనసున్నది మమతున్నది మా ఇంట
పై మొరుగులు పైడి నగలు లేవు ఇక్కడ
పంతాలు సాధింపులు రావు ఇక్కడ
నిండు మనసు చిరునగవు పండునిక్కడ
ఆ పండు వెన్నెలందు దినం పండుగిక్కడ
కన్నతల్లి కన్నమిన్న మీ అత్తగారు కనిపించే దైవము చేకొన్న వాడు
కలలన్నీ నిజమౌ నీ కాపురానా
కలకాలం వెలుగు నీ ఇంటి దీపము
No comments:
Post a Comment