Sunday, July 27, 2008

చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు :చిత్రం : వెలుగు నీడలు

చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
పడికిలి మూసిన చేతులు లేత గులాబీ రేకులు2
చెంపకు చారెడు సోగకన్నులె సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
ఇంటను వెలసిన దైవము కంటను మెరిసిన దీపము
మా హృదయాలకు హాయి నొసంగే పాపాయే ప్రాణము
మా పాపాయి నవ్వుపువ్వులే మంచి ముత్యముల వానలు
నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా2
పేరుప్రతిష్టలే నీ పెన్నిధిగా నూరేళ్ళాయువు పొందుమా
మా పాపాయి నవ్వుపువ్వులే మంచి ముత్యముల వానలు

No comments: