నా హృదయపు కోవెలలో
నా బంగరు లోగిలిలో
ఆనందం నిండెనులే అనురాగం పండెనులే….
నా హృదయపు కోవెలలో
మధువులు కురిసే గానముతో
మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో
నా మనసును నిలువున దోచితివే
నా హృదయపు కోవెలలో
శాంతికి నిలయం నీ హృదయం
నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మీ సరస్వతి నీవేలే
నా బ్రతుకున కాపురముందువులే
బ్రతుకున కాపురముందువులే
నా హృదయపు కోవెలలో
ఇంటికి నీవే అన్నపూర్ణగా
ప్రతిరోజూ ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో
మన వాకిలి కళకళలాడునులే
నా హృదయపు కోవెలలో
No comments:
Post a Comment