పువ్వు నవ్వెను పున్నమి నవ్వెను పులకరించి ఈ జగమూ నవ్వెను
కొలను నవ్వెను కోరిక నవ్వెను నవ్వలేక నేనున్నాను పువ్వు
వయసు నవ్వెను సొగసూ నవ్వెను నవ్వురాక ఈమనసే నలిగెను
వలపు నవ్వెను తలపూ నవ్వెను పగలకే అవి బలి అయిపోయెను పువ్వు
కడుపుతీపితో కన్నబిడ్డకై హితము కోరి ఏగిన తండ్రికి
చేయని నేరము శిక్ష వేసెను మాయని పాపం శాపాలాయెను పువ్వు
కలిమి చెలిమి వెలసిన ఇల్లు వెలుగు మాసి వెలవెలబోయెను
లోకం నవ్వెను శోకం మిగిలెను లోలోపల గుండెలవిసెను పువ్వు
No comments:
Post a Comment