నిన్ను చూడనీ నన్ను పాడనీ
ఇలావుండిపోనీ నీ చెంతనే
నిన్ను చూడనీ
ఈ కనులు నీకే ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఈ కనులు నీకే ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఇలావుండిపోనీ నీ దాసినై
నిన్ను చూడనీ నన్ను పాడనీ
నిన్ను చూడనీ
నీవులేని నేను ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
నీవులేని నేను ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
ఇలా రాలిపోనీ నీ కోసమే
నిన్ను చూడనీ నన్ను పాడనీ
ఇలావుండిపోనీ నీ చెంతనే
నిన్ను చూడనీ
No comments:
Post a Comment