Friday, July 4, 2008

జోలాలి ఓ లాలి నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాల

జోలాలి ఓ లాలి నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాల
రెండు మూడు మాసాలాయె ఉయ్యాల
జోలాలి ఓ లాలి నైనా మూడో మాసములోన ఉయ్యాల
ముడికట్ట్లు బిగువాయె ఉయ్యాల
జోలాలి ఓ లాలి నైనా మూడాయె నాలుగాయె ఉయ్యాల
నాలుగు అయిదు మాసములాయె ఉయ్యాల
జోలాలి ఓ లాలి నైనా అయిదాయె ఆరాయె ఉయ్యాల
ఆరు ఏడు మాసాములాయె ఉయ్యాల
జోలాలి ఓ లాలి ఏడో మాసములోన ఉయ్యాల
నైనా వేగుళ్ళు బయలెళ్ళె ఉయ్యాల
జోలాలి ఓ లాలి నైనా ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల
ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల
జోలాలి ఓ లాలి నైనా తొమ్మిది మాసములోన ఉయ్యాల
నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల
నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల

No comments: